భరత్ అను నేనులో భారీ మార్పులు..!

కొరటాల శివ మహేష్ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు తర్వాత ప్రస్తుతం భరత్ అను నేను సినిమా తెరకెక్కుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా విషయంలో ప్రతి చిన్న విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట మహేష్. స్పైడర్ సినిమా ఫెయిల్యూర్ ఎఫెక్ట్ ఈ సినిమాపై పడకుండా అన్ని విభాగాల్లో సినిమాను పర్ఫెక్ట్ గా ఉండేలా చూస్తున్నారట.

ఈమధ్య ప్లాన్ చేసిన షెడ్యూల్ పోస్ట్ పోన్ అవగా 2018 సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా సమ్మర్ కు పోస్ట్ పోన్ అయ్యిందని తెలుస్తుంది. బాలీవుడ్ భామ కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపించనున్నాడు.