
పటాస్, సుప్రీం సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు అనీల్ రావిపుడి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వస్తున్న సినిమా రాజా ది గ్రేట్. మాస్ మహరాజ్ రవితేజ హీరోగా మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నాడు. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో రవితేజ గుడ్డి వాడి పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రివ్యూల మీద తన అభిప్రాయం చెప్పాడు అనీల్ రావిపుడి. రివ్యూల మీద ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియట్లేదు. రివ్యూలు సరిగా రాసిన సినిమాలు ఆడకుండా పోయాయి. రివ్యూలు రాయకుండా ఉన్న సినిమాలు హిట్ అయ్యాయి. ఇక రివ్యూలు మంచిగా వచ్చి సినిమా సక్సెస్ అయినవి ఉన్నాయి. రివ్యూ రాసేవాళ్లయినా.. సినిమా తీసేవాళ్లైనా ఎవరు పర్ఫెక్ట్ కాదని అన్నాడు అనీల్ రావిపుడి. పటాస్ సినిమాకు పాజిటివ్ రివ్యూలతో పాటు నెగటివ్ రివ్యూలు వచ్చాయని.. అయితే కొంచం కొత్తగా ట్రై చేయాలని నిర్ణయించుకున్నానని.. అందుకే రాజా ది గ్రేట్ చేశానని అన్నాడు అనీల్ రావిపుడి.