ప్రభాస్ లుక్ అదిరింది..!

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. రన్ రాజా రన్ సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ అదరగొడుతుంది.


ఈమధ్యనే క్లాసీ లుక్ లో ప్రభాస్ అదరహో అనిపిస్తున్నాడు. బాహుబలి రిలీజ్ టైంలో ఫస్ట్ లుక్ టీజర్ మాత్రమే అఫిషియల్ గా వదిలిన సాహో టీం లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రభాస్ లుక్ మాత్రం సూపర్ అని చెప్పాలి. 2018 సమ్మర్ లో రాబోతున్న ఈ సినిమాతో బాహుబలి రేంజ్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు ప్రభాస్. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్కై ఫైటింగ్, స్కూబా ఫైటింగ్ కూడా ఉంటుందట.