
తమిళనాడు సిఎంతో అక్కడ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ చర్చలు జరపడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం అక్కడ రాజకీయాల్లో సినిమా వాళ్ల హంగామా ఎక్కువైందని తెలిసిందే. రజిని, కమల్ లాంటి వారు పార్టీ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విజయ్ తమిళనాడు సిఎం పళనిస్వామిని కలవడం రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి.
విజయ్ సిఎంకు సపోర్ట్ ఇచ్చేందుకు వచ్చాడని కొందరు అంటుంటే కొందరు రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కింద 10 శాతం నుండి 8 శాతానికి తగ్గించాడని అందుకు విష్ చేసేందుకు కలిశాడని కొందరన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే దీవాళికి రిలీజ్ కాబోతున్న మెర్సల్ సినిమాలో జల్లికట్టుకి సంబందించిన సీన్స్ ఉన్నాయట. వాటికి సంబందించి జంతు సంక్షేమ శాఖ నుండి ఎన్వోసి రాలేదట. అందుకే సిఎంను కలిసి సినిమా రిలీజ్ కు ఎలాంటి అడ్డంకి జరుగకుండా చేస్తున్నారట.