పవన్ తో అర్జున్ రెడ్డి డైరక్టర్..!

అర్జున్ రెడ్డి సినిమాతో తన సత్తా చాటుకున్న సందీప్ వంగ తన తర్వాత సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక సందీప్ తర్వాత సినిమా హీరో ఎవరు అన్న విషయం మీద పెద్ద చర్చే జరుగుతుంది. ఒక్క సినిమాతో తన టాలెంట్ చూపించిన ఈ దర్శకుడితో పనిచేయడానికి స్టార్స్ సైతం ఓకే అంటున్నారట.

ఈమధ్యనే సినిమా చూసిన పవర్ స్టార్ సందీప్ కు విష్ చేసేందుకు ఫోన్ చేసి మంచి లైన్ ఉంటే చెప్పమన్నాడట. దొరికిందే ఛాన్స్ అని పవన్ కు సరిపోయే ఓ లైన్ వినిపించాడట. అది కాస్త నచ్చడంతో డెవలప్ చేసుకురా అన్నట్టు చెప్పాడట పవన్. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతున్న ఈ న్యూస్ ఎంతవరకు నిజం తెలియదు కాని అర్జున్ రెడ్డి డైరక్టర్ తో పవన్ సినిమా అంటే కచ్చితంగా ఆ సినిమా అంచనాలు ఏర్పడినట్టే. మరి సినిమా ఆ అంచనాలకు తగ్గట్టు ఉంటుందా అసలు ఈ వార్తలు నిజమేనా అన్నది తెలియాల్సి ఉంది.