శర్వానంద్ తో నివేథా..!

మహానుభావుడు హిట్ తో మంచి జోష్ లో ఉన్న శర్వానంద్ తన తర్వాత సినిమా సుధీర్ వర్మతో చేస్తున్నాడని తెలిసిందే. కేశవ తర్వాత సుధీర్ వర్మ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలున్నాయి. అది కాక కెరియర్ లో మంచి ఫాంలో ఉన్న శర్వానంద్ హీరోగా సినిమా అంటే ఇక అందరి గురి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నివేథా థామస్ ను సెలెక్ట్ చేశారట.

హీరోయిన్ కు ఎక్కువ ప్రాధ్యాన్యత ఉన్న ఈ సినిమాలో ఆమె అయితేనే పర్ఫెక్ట్ అని తీసుకున్నారట. అంతేకాదు సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉందని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి శర్వానంద్ తో నివేథా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలాను సృష్టిస్తుందో చూడాలి. టాలీవుడ్ లో తమ సహజ నటనతో ఆకట్టుకునే హీరోల్లో నాని తర్వాత శర్వానంద్ వస్తాడు. మరి అలాంటి నాచురల్ హీరోతో నివేథా ఎలాంటి సినిమాతో వస్తుందో తెలియాల్సి ఉంది.