హరితేజకు జబర్దస్త్ ఆఫర్..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లో చలాకిగా మొదటి రోజు నుండి 70 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన హరితేజ అసలైతే బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ అయ్యేట్టు కనిపించినా శివ బాలాజి ఆ ఛాన్స్ కొట్టేశాడు. విన్నర్ కాకున్నా సరే హరితేజ బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెలుచుకుంది. అందుకే ఆమెకు స్మాల్ స్క్రీన్ లో అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయట.  

ఈటివిలో జబర్దస్త్ షోలో రష్మి బదులు హరితేజ రీప్లేస్ చేస్తున్నారని లేటెస్ట్ టాక్. వచ్చి రాని తెలుగుతో షోని నడిపిస్తున్న రష్మి కంటే హరితేజ బెటర్ అని నిర్ణయించింది మల్లెమాట టీం అందుకే రష్మి బదులు హరితేజను దించే ఆలోచనలో ఉన్నారట. ఓ పక్క జబర్దస్త్ అనసూయ అదరగొడుతుండగా ఎక్స్ ట్రా జబర్దస్త్ తో రష్మి కూడా అలరిస్తుంది. మరి రష్మి ప్లేస్ లో హరితేజ వస్తే షో ఎలా ఉండబోతుందో చూడాలి.