
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా రచయిత బివిఎస్ రవి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా జవాన్. అసలైతే సెప్టెంబర్ లోనే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అక్టోబర్ లో అయినా రిలీజ్ మోక్షం కలుగుతుందని భావించారు. కాని ఇప్పుడు ఏకంగా డిసెంబర్ దాకా ఆ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. సినిమా నిర్మాత కృష్ణ దిల్ రాజుకి దగ్గర మనిషి. ఆయన చెప్పినప్పుడే సినిమా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాడట.
ఇక మరో పక్క తేజ్ జవాన్ మీద ఆశలు వదులుకున్నాడట. సినిమా అనుకున్న అవుట్ పుట్ తీసుకు రాలేకపోయాడట బివిఎస్ రవి. అందుకే ఆ సినిమా పూర్తి చేసి రిలీజ్ విషయంలో జోక్యం చేసుకోవట్లేదట సాయి ధరం తేజ్. కెరియర్ లో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉన్నా సాయి ధరం తేజ్ జవాన్ ఇలా రిలీజ్ సంక్షోభంలో పడటం చూస్తుంటే మనోడి కెరియర్ కాస్త గాడి తప్పిందని అనుకోవచ్చు.