
సూపర్ స్టార్ మహేష్ బాబు ఛత్రపతి శివాజిగా చేస్తే బాగుంటుందని తన మనసులోని మాటని బయట పెట్టారు పరుచూరి గోపాలకృష్ణ. ఈమధ్యనే పరుచూరి పలుకులు అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ దాని ద్వారా ఎన్నో మంచి విషయాలను షేర్ చేస్తున్నారు. ఇక నిన్న దర్శకధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ను విష్ చేస్తూ మహేష్ తో ఛత్రపతి శివాజి సినిమా తీయాలని కోరుకున్నారు.
అప్పట్లో ఎన్.టి.ఆర్, కృష్ణ శివాజి చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు చేద్దామనుకున్నా ఎందుకో కుదరలేదట. అందుకే మహేష్ తో ఛత్రపతి శివాజి సినిమా చేయాలని తన అభిప్రాయం వెళ్లబుచ్చాడు. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటేనే రికార్డులే.. అలాంటిది శివాజి చరిత్ర తెరకెక్కిస్తే ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మరో అద్భుత కళాకండం వచ్చినట్టే. మరి పరుచూరి కోరిక మేరకు రాజమౌళి మహేష్ తో అదే సినిమా చేస్తాడో లేదో వేచి చూడాలి.