హలోకి అంత సీన్ ఉందా..!

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హలో. నాగార్జున నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉంది. ఇక ఈ సినిమాను ఓవర్సీస్ లో 5.5 కోట్లకు కోట్ చేశారట. 4.5 టూ 5 కోట్ల డీల్ వచ్చినా 5.5 ఇస్తేనే అన్నట్టు చెబుతున్నారట.

యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అఖిల్ సరసన కళ్యాణి ప్రియదర్శిని నటిస్తుంది. సినిమా అంచనాలను అందుకుంటే పర్వాలేదు కాని అఖిల్ సినిమాలా నిరాశ పరిస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అసలకే స్టార్ సినిమాలు కూడా ఓవర్సీస్ కలక్షన్స్ ఈమధ్య బోల్తా కొడుతున్నాయి ఈ టైంలో తెలుగు సినిమాలు అక్కడ కొనేందుకు వెనుకడుగేస్తున్నారు. మరి అఖిల్ కోరిన ఐదున్నర ఇచ్చినా దాన్ని రాబట్టగలిగితే అక్కడ డిస్ట్రిబ్యూటర్ హ్యాపీ అని చెప్పొచ్చు.