
విజయ్ దేవరకొండ హీరోగా చిన్న సినిమాల్లో సంచలన విజయం అందుకున్న అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ కు క్రేజీ కాంబినేషన్ సెట్ చేశారు. చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ హీరోగా రీమేక్ కాబోతున్న తమిళ అర్జున్ రెడ్డి సినిమాను క్రేజీ డైరక్టర్ బాలా టేకప్ చేస్తున్నాడని లేటెస్ట్ టాక్. తన సహజమైన సినిమాలతో అటు తమిళ ప్రేక్షకులనే కాదు తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలా లాంటి సీనియర్ క్లాసిక్ డైరక్టర్ ఇప్పటికి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అయిన అర్జున్ రెడ్డిని ఎలా తీస్తాడో అన్న ఇంట్రెస్ట్ పెరిగింది.
అది కాకుండా ధ్రువ్ హీరోగా అంటే విక్రంకు విపరీతమైన టెన్షన్ ఉంటుంది. అయితే బాలా డైరక్షన్ లో శివపుత్రుడు సినిమా విక్రం చేశాడు. నటుడిగా విక్రం లోని కొత్త యాంగిల్ ఆ సినిమాతోనే బయట పడింది. అందుకే అర్జున్ రెడ్డి రీమేక్ కు బాలాని తీసుకున్నారు. మరి బాలా చేతిలో పడ్డాక అర్జున్ రెడ్డి ఎలా ఉంటుంది అన్నది చూడాలి.