అమర్ అక్బర్ ఆంటోనీగా రవితేజ..!

మాస్ మహరాజ్ రవితేజ మళ్లీ మునుపటి ఫాంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న రవితేజ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో చేసిన రాజా ది గ్రేట్ సినిమా ఈ దీవాళికి వస్తుందని తెలుస్తుంది. ఇక దీనితో పాటుగా కొత్త దర్శకుడు విక్రం సిరి డైరక్షన్ లో కూడా టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు రవితేజ. ఇక ఇవే కాకుండా శ్రీను వైట్ల డైరక్షన్ లో రవితేజ ఓ సినిమా చేయబోతున్నాడట.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని టాక్. ఇక సినిమా టైటిల్ గా అమర్ అక్బర్ ఆంటోని అనే పేరు వినిపిస్తుంది. సినిమాలో ఒకడే ముగ్గురిగా కనిపిస్తాడట. రవితేజ కెరియర్ లో చాలా ప్రెస్టిజియస్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగా ఉన్నాయి. శ్రీను వైట్ల, రవితేజ ఇద్దరు కెరియర్ స్టార్టింగ్ నుండి మంచి బాండింగ్ ఉంది. ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్లను హిట్ ట్రాక్ ఎక్కించాలని చేస్తున్న రవితేజ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.