బుల్లితెర యాంకర్ మల్లిక మృతి..!

ప్రముఖ తెలుగు యాంకర్ మల్లిక చివరి శ్వాస విడిచారు. తెలుగు బుల్లితెర మీద తన వ్యాఖ్యానంతో అలరించిన మల్లిక 1997 నుండి 2004 వరకు తిరుగులేని యాంకరింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక స్మాల్ స్క్రీన్ మాత్రమే కాదు సీరియల్స్  సినిమాల్లో కూడా ఆమె నటించి మెప్పించారు. మహేష్ హీరోగా చేసిన రాజకుమారుడు సినిమాలో సూపర్ కృష్ణ జోడిగా మల్లిక నటించారు.

కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న మల్లిక 20 రోజుల నుండి కోమాలో ఉన్నట్టు సమాచారం. వైద్యానికి ఆమె శరీరం సహకరించక ఈరోజు ఉదయం ఆమె మరణించినట్టు ధృవీకరించారు. పెళ్లి తర్వాత బుల్లితెరకు కాస్త దూరంగా ఉన్న మల్లిక తెలుగు తెర మీద యాంకర్ గా ఎన్నో మంచి అవార్డులను సైతం అందుకున్నారు. మల్లిక మరణానికి సిని పరిశ్రమ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియచేస్తున్నారు.