'బ్రహ్మతేజ' బ్యానర్ తో బాలయ్య..!

నందమూరి బాలకృష్ణ నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం 102వ సినిమా చేస్తున్న బాలకృష్ణ తన నిర్మాణ సంస్థలోనే ఎన్.టి.ఆర్ బయోపిక్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకు గాను ఓ ప్రొడక్షన్ హౌజ్ స్థాపించాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ పేరుని బ్రహ్మతేజని పెట్టబోతున్నారట.

బాలయ్య తనయురాళ్లు బ్రహ్మణి, తేజశ్విల పేర్లతో బ్రహ్మతేజ అని నిర్మాణ సంస్థని ప్రారంభిస్తారట బాలయ్య. ఇక ఈ బ్యానర్లోనే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాతో పాటుగా తన నట వారసుడు మోక్షజ్ఞతో సినిమా తీయాలని చూస్తున్నాడు బాలయ్య బాబు. తేజ డైరక్షన్ లో రాబోతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ కు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో వెళ్లడిస్తారట.