
విజయ్ దేవకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. ఈమధ్యనే రిలీజ్ అయిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఇక ఈ సినిమాలో సెన్సార్ కట్స్ చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ కట్ చేశారట కూడా. సినిమాలో ఆ సీన్స్ బీప్ సౌండ్ లేకుండానే అమేజాన్ ప్రైమ్ లో చూడొచ్చంటున్నారు. ఈ నెల 13న అమేజాన్ ప్రైం లో ఈ సినిమా వస్తుంది.
సెన్సార్ వారు కట్, బీప్ వేసిన సీన్స్ ఇందులో క్లియర్ గా వస్తాయట. మొత్తానికి యూత్ ఆడియెన్స్ కు అమేజాన్ ప్రైం ఓ అద్భుత అవకాశం ఇస్తుంది. 4 కోట్లతో వచ్చిన ఈ సినిమా 40 కోట్ల దాకా వసూళ్లను రాబట్టింది. విజయ్ తో పాటుగా షాలిని పాండే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో సినిమాకు పనిచేసిన అందరికి మంచి పేరు తెచ్చి పెట్టింది.