
రాజ్ తరుణ్ హీరోగా సంజనా రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజుగాడు. సినిమా షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ డిసెంబర్ కల్లా పూర్తవుతుందని తెలుస్తుంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ అమిరా దస్తర్ తెలుగులో చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాను పొంగల్ వార్ లో దించేలా ప్లాన్ చేస్తున్నారట. గత కొన్నాళ్లుగా పండుగకు పెద్ద సినిమాలతో పోటీగా వచ్చి సక్సెస్ కొడుతున్న శర్వానంద్ ను స్పూర్తిగా తీసుకుని రాజ్ తరుణ్ కూడా ఈ సాహసం చేయబోతున్నాడట.
శర్వానంద్ ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి, మహానుభావుడు మూడు పండుగ సీజన్ లో పెద్ద సినిమాల మధ్య పోటీగా వచ్చింది. విచిత్రం ఏంటంటే స్టార్ హీరోల సినిమాలైనా నిరాశ పరుస్తాయేమో కాని శర్వానంద్ మాత్రం నిరాశ పరచట్లేదు ఇక అదే దారిలో ఈసారి సంక్రాంతికి శర్వానంద్ బదులు రాజ్ తరుణ్ వస్తున్నాడట. ఓ పక్క పవర్ స్టార్ త్రివిక్రం మూవీ మరో పక్క బాలయ్య 102వ మూవీ ఈ రెండిటి మధ్య రాజ్ తరుణ్ రాజుగాడు వచ్చి హిట్ కొడతాడా అన్నది వేచి చూడాలి.