
మాస్ మహరాజ్ రవితేజ హీరోగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజా ది గ్రేట్. సినిమాలో కళ్ళులేని పాత్రలో నటిస్తున్న రవితేజ టీజర్ తో ఆకట్టుకోగా నిన్న సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లైఫ్ ఎదురొచ్చి ఇవ్వదు.. మనమే ఎదురెళ్లి తీసుకోవాలి అంటూ చెప్పే రవితేజ డైలాగ్ ట్రైలర్ లో హైలెట్ అనిపిస్తుంది. ఇక రాజా ది వారియర్ అంటూ ఇచ్చే వార్నింగ్ కూడా ట్రైలర్ కు మంచి ఫినిషింగ్ ఇచ్చింది.
పటాస్, సుప్రీం సినిమాల తర్వాత అనీల్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. బెంగాల్ టైగర్ తర్వాత మాస్ రాజా రవితేజ చేసే ఈ సినిమా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి. మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ట్రైలర్ పవర్ ఫుల్ గా ఉండగా సినిమా కూడా అంచనాలను అందుకుంటుందని అనిపిస్తుంది. ఈ నెల 18న రిలీజ్ అవనున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.