కష్టకాలంలో తమిళులే కాపాడారట..!

కలక్షన్స్ మోహన్ బాబు ఎం.జి.ఆర్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకోవడం జరిగింది. తమిళనాడు రాష్ట్ర ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చేతుల మీదుగా ఈ డాక్టరేట్ అందుకున్నారు మోహన్ బాబు. ఇక తన కెరియర్ మొదట్లో తమిళ ప్రజలే తనను కాపాడారని.. మొదట్లో విలన్ వేషాలు వేసుకునే తనని తన గురువు దాసరి నారాయణ రావు హీరో చేశారని అన్నారు. 

చెన్నైలో వైఎంసిఏ లో డ్రిల్ మాస్టర్ గానే కాకుండా.. టీనగర్ కేసరి స్కూల్ లో టీచర్ గా పనిచేసిన రోజులని గుర్తు చేసుకున్నారు మోహన్ బాబు. తనని విలన్ గా తమిళ పరిశ్రమకు పరిచయం చేసింది శివాజి గణేషన్ అని.. ఇక తనకి చెన్నై వస్తే పుట్టింటికి వచ్చిన అనుభూతి కలిగుతుందని అందుకే తమిళనాడు తనకి జన్మభూమి అంటూ చెప్పొకొచ్చారు. తనకు మొదట అవకాశం ఇచ్చింది తమిళ పరిశ్రమ కావొచ్చు కాని తనని ఇంత వాడిని చేసిన తెలుగు పరిశ్రమ గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది.