
తెలుగులో రెండు సినిమాల్లో క్యూట్ లుక్స్ తో అలరించినా రాని ఇమేజ్ స్టైలిష్ స్టార్ డిజెలో బికిని వేయగానే హీరోయిన్ పూజా హెగ్దె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బన్నితో హిట్ బొమ్మ పడేసరికి అమ్మడికి ఆఫర్లు కూడా అదిరిపోయే రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్దె. బాలీవుడ్ లో సల్మాన్ నటిస్తున్న రేస్-3లో కూడా సెకండ్ లీడ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుందట.
ఇక ఇదే కాకుండా డిజెతో తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ఏర్పడ్డ మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని రాం చరణ్ రంగస్థలంలో ఐటం సాంగ్ ఛాన్స్ కూడా ఇచ్చారట. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సమంత ఫీమేల్ లీడ్ గా నటిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె ఐటం సాంగ్ చేస్తుందట. సుక్కు సినిమాలో ఐటం అంటే ఆ స్పెషల్ ఐటం నెంబర్ కు ఉండే రేంజ్ వేరు. మరి మాస్ మసాలా సాంగ్ తో పూజా లాంటి అందాల ముద్దుగుమ్మ అందాలు కురిపిస్తుంటే ఇక ప్రేక్షకులకు అంత కన్నా ఏముంటుంది చెప్పండి. మరి పూజా ఈ సాంగ్ లో ఎలా ఉండబోతుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.