
కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారన్న వార్త తెలిసిందే. ఇదేదో రూమర్ అన్నట్టు కొట్టిపారేయగా ఈ సినిమాపై నాగార్జున క్లారిటీ ఇచ్చి అందరిని సర్ ప్రైజ్ చేశాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం ఎం.సి.ఏ, కృష్ణార్జున యుద్ధం సినిమాలు కమిట్ అయ్యాడు. అవి పూర్తి చేసుకున్నాక నాగ్ తో మల్టీస్టారర్ చేస్తాడట.
శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది. భలే మంచి రోజు, శమంతకమణి లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన శ్రీరాం ఆదిత్య యువ హీరోలతో చేసిన మల్టీస్టారర్ ఆకట్టుకుంది. సినిమాలో నాని పాత్ర చాలా చలాకీగా ఉంటుందంటూ చెప్పిన నాగార్జున సినిమా తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తుందని అన్నారు.