జవాన్ గా రాబోతున్న మెగా హీరో!

మెగా మేనల్లుడుగా టాలీవుడ్ లో కొనసాగుతున్న సుప్రీం హీరో సాయిధరమ్ తేజ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, ఇలా వరుస హిట్ సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ఇప్పుడు మరిన్ని సినిమాలను లైన్లో పెట్టేసుకున్నాడు. 

ప్రస్తుతం సాయిధరమ్ తేజ హీరోగా నటిస్తున్న తిక్క సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజాగా ప్రముఖ రచయిత బివిఎస్ రవి ఫిలిం ఛాంబర్ లో ‘జవాన్’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ ను సాయిధరమ్ తేజతో సినిమా చేయడానికే అని సమాచారం.

గతంలో రవి దర్శకత్వంలో వచ్చిన వాంటెడ్ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈసారి ఎలాగైనా ఓ హిట్టు కొట్టాలనే ఉద్దేశ్యంతో ఈ జవాన్ కథను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సినీవర్గాల సమాచారం ప్రకారం తిక్క తర్వాత గోపిచంద్ మలినేని మరియు బివిఎస్ రవి సినిమాల ప్రాజెక్టులు ఒకేసారి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.