మహేష్ కు విలన్ గా ఎస్.జే.సూర్య ఖరారు

బ్రహ్మోత్సవం తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. జులై మొదటి వారంలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. అసలే మురుగదాస్ తీసిన సినిమాలన్నీ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషలలో కూడా కలెక్షన్ల మోత మోగించాయి. అయితే ఇపుడు మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ కొత్త సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు ఎస్.జే.సూర్య నెగెటివ్ పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని తాజాగా మురుగదాస్ స్పష్టం చేసాడు. తన సినిమాలో ఎస్.జే.సూర్య నెగెటివ్ పాత్రలో నటించనున్నాడని, అతనితో పనిచేయడానికి ఇష్టపడుతున్నట్లుగా మురుగదాస్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. అందుకు ఎస్.జే.సూర్య కూడా స్పందిస్తూ తాను కూడా వెయింటింగ్ అని చెప్పుకొచ్చాడు. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.