సంక్రాంతి రేసు నుండి మహేష్ ఎక్సిట్..!

పండుగ వచ్చింది అంటే స్టార్ సినిమాలతో కళకళలాడటం కామనే. ఫెస్టివల్ సీజన్ కు ముందే తమ సినిమాల రిలీజ్ హంగామా మొదలు పెట్టేస్తారు స్టార్ హీరోలు. ఇక రానున్న సంక్రాంతి బరిలో రాం చరణ్ రంగస్థలం, పవన్ కళ్యాణ్ త్రివిక్రం మూవీ వస్తుండగా బాలయ్య కూడా ఈ పోటీలో నిలుస్తాడని తెలుస్తుంది. ఇక వీరే కాకుండా స్పైడర్ తో నిరాశపరచిన మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అను నేను కూడా ఉంటుందని అనుకున్నారు.

స్పైడర్ నిరాశ పరచడంతో డీలా పడ్డ మహేష్ జరగాల్సిన భరత్ అను నేను రోమ్ షెడ్యూల్ సైతం క్యాన్సిల్ చేయించాడట. మురుగదాస్ కాంబోలో తెలుగు తమిళ భాషల్లో తిరుగులేని హిట్ కొడదాం అనుకున్న మహేష్ ఆలోచనలకు స్పైడర్ రిజల్ట్ చాలా అసంతృప్తిని మిగిల్చింది. అందుకే కొద్దిపాటి గ్యాప్ తీసుకుంటున్నాడట. సంక్రాంతి రేసు నుండి ఎక్సిట్ అయినట్టే అని అంటున్నారు. ఫెస్టివల్ మిస్ అయ్యింది అంటే ఇక సమ్మర్ లోనే భరత్ అను నేను మూవీ వస్తుందన్నమాట.