
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సిద్ధార్థ్ తమిళ నటుడే అయినా తెలుగులో అతను చేసిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు ఇక్కడ సూపర్ క్రేజ్ వచ్చేసినట్టే అనిపించినా తర్వాత సినిమాలు నిరాశ పరచడంతో వెనుకపడ్డాడు. ఇక ప్రస్తుతం సిద్ధార్థ్ నటిస్తున్న సినిమా ద హౌజ్ నెక్ష్ట్ డోర్.
హారర్ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తారట. ఆండ్రియా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మిలింద్ రావ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు టైటిల్ రివీల్ చేసిన సిద్ధార్థ్ సినిమాను నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నాడు. ఇక ఇదే కాకుండా సిద్ధార్థ్ తమిళంలో సైతాన్ కా బచ్చా సినిమా కూడా చేస్తున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.