ఎన్టీఆర్ త్రివిక్రం మూవీ అప్డేట్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందట. ప్రస్తుతం చేస్తున్న పవన్ సినిమా పూర్తి కాగానే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ మిలటరీ అధికారిగా నటిస్తాడని తెలుస్తుంది. అందుకోసం స్పెషల్ లుక్ కూడా ట్రై చేస్తున్నాడట.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఫిబ్రవరి మార్చిలలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి ఎన్.టి.ఆర్ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉన్నారట. రీసెంట్ గా వచ్చిన జై లవ కుశ సినిమాతో హిట్ అందుకున్న తారక్ త్రివిక్రం తో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.