సవ్యసాచి కోసం బాలీవుడ్ భామ..!

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ ను సెలెక్ట్ చేశారట. బాలీవుడ్ లో మున్నా మైకేల్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ సినిమాలో తన అందాలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.

ఇక సౌత్ లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి లక్కీ ఛాన్స్ తగిలిందని చెప్పొచ్చు. ప్రేమం రీమేక్ తర్వాత నాగ చైతన్య, చందు మొండేటి కలిసి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. టైటిల్ దగ్గర నుండి సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చందు మొండేటి చైతు కెరియర్ లో సినిమా ఓ మైల్ స్టోన్ మూవీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. హీరోయిన్ నిధి ఎంపిక కూడా అందుకే అని అంటున్నారు. మరి సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కించేస్తారో చూడాలి.