ఎన్టీఆర్ తో చరణ్ అదిరిపోయే పిక్..!

అభిమానులు మధ్య విభేధాలు ఉంటాయి కాని తమ మధ్య అలాంటివాటికి ఏమాత్రం తావు లేదని స్టార్స్ చెబుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం ఇద్దరు స్టార్ దిగిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఎవరో కాదు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి ఒకరి భుజాల మీద ఒకరు చేయేసుకుని చేసిన హంగామా పిక్ లో కనిపిస్తుంది.

ఇద్దరి క్లోజ్ నెస్ ఏంటో ఫోటో చూస్తే తెలుస్తుంది. చరణ్ కోసం జై లవ కుశ స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటుచేశారు. ఆ సందర్భంలో దిగిన చరణ్, ఎన్.టి.ఆర్ పిక్ ఇరు వర్గాల ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. జై లవ కుశలో ఎన్.టి.ఆర్ నటనకు చరణ్ కూడా ఈ జెనరేషన్ లో ఇలా నటించడం ఎవరి వల్లా కాదని అన్నాడట. మొత్తానికి తానో స్టార్ కాంపిటీటర్ అయినా సరే తారక్ ను కలిసి చరణ్ ప్రశంసించిన తీరు చూస్తుంటే పరిశ్రమలో హీరోల మధ్య సత్సంబంధాలను తెలియచేస్తుంది.