సూర్య దసరా ట్వీట్.. కదిలించేసింది..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య దసరా సందర్భంగా చేసిన ట్వీట్ మనసులను కదిలించేస్తుంది. తన నటనతో తెలుగు తమిళ ప్రేక్షకులను అలరిస్తున్న సూర్య తను స్థాపించిన అగరం ఫౌండేషన్ ద్వారా కూడా పేద విద్యార్దులను ఆదుకుంటున్నాడు. ఇక సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా అదే రేంజ్లో రెస్పాండ్ అయ్యే సూర్య విజయ దశమి సందర్భంగా పెట్టిన ట్వీట్ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది.  

మహిళల సమస్య గురించి ఈ ట్వీట్ చేశారు సూర్య.. ఇంతకీ సూర్య ఏమని ట్వీట్ చేశారంటే.. ఏ దుర్గా గర్భస్రావానికి గురికాకూడదని.. ఏ సరస్వతీ పాఠశాలకి వెళ్లకుండా ఆగిపోకూడదని.. ఏ లక్ష్మీ డబ్బు కోసం తన భర్తను ప్రాధేయపడకూడదని.. కట్నానికి ఏ పార్వతీ బలి కాకూడదని.. ఏ సీతా తనలో తాను కుమిలిపోకూడదని.. ఏ కాళీదేవికి ఫెయిర్నెస్‌ క్రీమ్‌ ఇవ్వకూడదని.. పండుగ సందర్భంగా ప్రార్థించండి.. అంటూ ట్వీట్ చేసి మరోసారి తన మంచితనం చాటుకున్నాడు సూర్య.