
యంగ్ టైగర్ మూడు విభిన్న పాత్రల్లో నటించిన జై లవ కుశ అంచనాలకు తగ్గట్టుగానే సందడి చేస్తుంది. సినిమాలో జై, లవ, కుశలుగా నటించిన తారక్ మూడు పాత్రలకు తగిన న్యాయం చేశాడు. ఇంకా చెప్పాలంటే జై గా తారక్ అదరగొట్టాడని చెప్పాలి. ప్రస్తుతం సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అయ్యింది అంటే అది కచ్చితంగా జై పాత్ర వల్లే.
అయితే ఆ పాత్రని క్లైమాక్స్ లో చంపేయడం ఫ్యాన్స్ ను కాస్త నిరాశ పరచింది. సినిమాకు ఆయుపు పట్టుగా ఉన్న ఆ పాత్రని చంపడం ఏంటని అనుకున్నారు. ఇక ఇదే విషయంపై ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. కథ రాసుకున్నప్పుడు బాబి ఈ సినిమాలో జై పాత్ర కూడా మారి ముగ్గురు కలవడంతో హ్యాపీ ఎండింగ్ అనుకున్నాడట. తారక్ మాత్రం ఆ పాత్ర చనిపోతేనే బాగుంటుందని అన్నాడట. కళ్యాణ్ రాం కూడా అలానే చెప్పడంతో జై పాత్రని చంపేశారు. మొత్తానికి పాత్ర చంపేసినా సినిమా నిలబెట్టారు కాబట్టి చిత్రయూనిట్ అందరికి ఈ సినిమా ఫలితం మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.