
డిజె సినిమాతో కెరియర్ లో హిట్ అందుకున్న పూజా హెగ్దె ప్రస్తుతం మంచి స్వింగ్ లో ఉందని చెప్పొచ్చు. డిజె సక్సెస్ తర్వాత ఏమాత్రం గ్యాప్ లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న పూజా బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కు సెలెక్ట్ అయ్యింది. సల్మాన్ ఖాన్ హీరోగా రాబోతున్న రేస్-3 సినిమాలో సెకండ్ హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకుంది పూజా.
మాస్క్, ముకుంద, ఒక లైలా కోసం, మొహెంజోదారో సినిమాలతో నిరాశ పడిన అమ్మడు దువ్వాడ జగన్నాధం ఒక్క హిట్ తో దశ తిరిగిపోయింది. జాక్వెలిన్ లీడ్ హీరోయిన్ గా ఫైనల్ అవగా సెకండ్ ఫీమేల్ లీడ్ గా పూజా సెలెక్ట్ అయ్యింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఆ సినిమాలో పూజాకు ఛాన్స్ దొరకడం నిజంగా లక్కీ అని చెప్పాలి. ఇక చేస్తున్న బెల్లంకొండ సినిమా కూడా తెలుగులో మళ్లీ హిట్ కొట్టేస్తుందని అంటున్నారు. చూస్తుంటే పూజా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండిటిలో క్రేజీ బ్యూటీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.