7వేల కోట్ల బడ్జెట్ అవతార్ సీక్వల్స్..!

జేమ్స్ కెమరాన్ డైరెక్ట్ చేసిన అవతార్ సినిమా గురించి అందరికి తెలిసిందే. హాలీవుడ్ సినిమాల్లో అదో గొప్ప సినిమాగా పరిగణించవచ్చు.. టైటానిక్ తర్వాత అదే రేంజ్ లో అన్ని దేశాలను భాషతో సంబంధం లేకుండా ఉత్సాహపరచిన సినిమా అవతార్. మొదటి పార్ట్ 1600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన అవతార్ 20 వేల కోట్ల కలక్షన్స్ ను రాబట్టింది.       

ఇక ఈ సినిమాకు 2,3,4,5 పార్టులు ఉంటాయని కేమరాన్ ప్రకటించారు. ఇక మొదటి సీక్వల్ 2020 డిసెంబర్ 17న రాబోతుందట. దీని బడ్జెట్ దాదాపు 7వేల కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. ఈ సీక్వల్స్ అన్నిటికి కలిపి ఈ బడ్జెట్ అనుకుంటున్నారట. ఎలా లేదన్నా మళ్లీ ఒక్కోదానికి 2 వేల కోట్ల బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. మరి ఆ రేంజ్ బడ్జెట్ అంటే సినిమా కచ్చితంగా మరో అద్భుత ప్రపంచం సృష్టిస్తారని చెప్పొచ్చు.