
మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన స్పైడర్ అంచనాలను అందుకోలేదు అంటున్నారు కాని ఆ టాక్ కలక్షన్స్ మీద మాత్రం ప్రభావం చూపించట్లేదని తెలుస్తుంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ మీద మహేష్ వీర ప్రతాపం చూపిస్తున్నాడు. కేవలం ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్క్ అందుకున్న స్పైడర్ సంచలనం సృష్టించాడు.
ఇక రెగ్యులర్ షోస్ అన్ని కలిపితే ఇప్పుడు యూఎస్ లో టాలీవుడ్ భారీ కలక్షన్స్ సాధించిన సినిమాల్లో టాప్ 4 లో ఉంది స్పైడర్. బాహుబలి 2 తొలి స్థానంలో ఉండగా, బాహుబలి 1 ఆ తర్వాత ఖైది నంబర్ 150 ప్రీమియర్ కలక్షన్స్ తో హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించిన లిస్ట్ లో ఉన్నారు. ఏపి, తెలంగాణా లో స్పైడర్ మొదటి రోజు 15.3 కోట్లను రాబట్టగలిగింది. ఎలాగు పండుగ సెలవలు ఉన్నాయి కాబట్టి స్పైడర్ ను సేఫ్ జోన్ లో పడేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.