
కోలీవుడ్ హీరో అయినా సరే తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు కార్తి. సూర్య తమ్ముడిగా కార్తి అక్కడ ఇక్కడ ఒకేరకమైన క్రేజ్ తెచ్చుకున్నాడంటే నమ్మాలి. డబ్బింగ్ సినిమాలతో కార్తి స్ట్రైట్ సినిమాల మాదిరి హిట్ అందుకున్నాడు. ఇక ప్రస్తుతం మరోసారి తన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరిస్తున్నాడు కార్తి.
ఖాకి అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో కార్తి పోలీస్ గా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వినోద్ డైరక్షన్ లో వస్తుంది. ఇంటెన్స్ ఉన్న సినిమాగా ఇందులో కార్తి సీరియస్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది.
ఆడియో రంగంలో అగ్రగామి సంస్థగా పేరు తెచ్చుకున్న ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా నిర్మించడం జరుగుతుంది. ఇక టీజర్ మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేశారు. అక్టోబర్ 17న ట్రైలర్ నవంబర్ 17న సినిమా రిలీజ్ ప్లాన్ లో ఉన్నారట.