అతనే త్రివిక్రమ్, దిల్ రాజుల స్టార్ హీరో?

నిన్న నిర్మాత దిల్ రాజు తన బ్యానర్ లో మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ స్టార్ హీరోతో ఓ సినిమా చేయబోతున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రకటించిన క్షణం నుంచి టాలీవుడ్ ఈ విషయంపై చర్చలు ఎక్కువయ్యాయి.

వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే సినిమాలో హీరోగా ఎవరు నటించబోతున్నారు అని సినీవర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఆ స్టార్ హీరో ఎవరూ అనే జాబితాలో పవన్ కళ్యాణ్, రవితేజ, అల్లు అర్జున్ ల పేర్లు వినిపించాయి. కానీ ఈ సినిమాలో నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరనేది ఫైనలైజ్ అయ్యింది.

సినీవర్గాల తాజా సమాచారం ప్రకారం... త్రివిక్రమ్-దిల్ రాజుల కాంబినేషన్లో రూపొందనున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించబోతున్నాడని తెలిసింది. ప్రస్తుతం ‘ధృవ’ సినిమా షూటింగ్ లో బిజీగా వున్న రాంచరణ్.. ‘ధృవ’ తర్వాత త్రివిక్రమ్ సినిమాలో నటించనున్నాడని సమాచారం. మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటించనున్నారు.