చైతు సినిమాలో మాధవన్..!

కోలీవుడ్ క్రేజీ హీరో మాధవన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.. సఖి సినిమాతో తెలుగులో మంచి హిట్ అందుకున్న మాధవన్ కేవలం డబ్బింగ్ సినిమాలతోనే తెలుగులో కూడా ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ఇక ప్రస్తుతం కోలీవుడ్ లో డిఫరెంట్ సినిమాలను చేస్తూ వస్తున్న మాధవన్ తెలుగులో డైరెక్ట్ మూవీకి ఓకే చెప్పాడని తెలుస్తుంది.

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సినిమా సవ్యసాచి. ప్రేమం లాంటి హిట్ అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సెకండ్ మూవీ కాబట్టి ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అంతేకాదు సినిమాలో చైతుతో పాటుగా కోలీవుడ్ హీరో మాధవన్ నటిస్తున్నాడని తెలిసి సినిమా మీద మరింత అంచనాలు పెరిగాయి.

ఈమధ్యనే మాధవన్ ను కలిసి స్టోరీ వినిపించారట దర్శక నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా చైతు కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు.