విక్టరీ వెంకటేష్ మరో రీమేక్..!

గురు సినిమా సక్సెస్ అయినా సరే వెంకటేష్ తన తర్వాత సినిమా విషయంలో ఎలాంటి ఫైనల్ డెశిషన్ తీసుకోలేదు. క్రిష్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు వెంకటేష్ ను కలిసి కథలు వినిపించినా సరే ఎందుకో వారికి ఓకే చెప్పలేదు. ఇక లేటెస్ట్ గా వెంకటేష్ మరో రీమేక్ సినిమాలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

బాలీవుడ్ క్రేజీ హీరో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా రీమేక్ లో వెంకటేష్ నటిస్తున్నాడని టాక్. ఇప్పటికే దీనికి సంబందించిన చర్చలు మొదలు పెట్టారట. ఇందులో రితిక సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని అంటున్నారు. ఇప్పటికే గురు సినిమాలో ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఆడియెన్స్ ను అలరించింది. 

ఇక తనకు సరిపోయే కథలు దర్శకులు చెప్పట్లేదనే వెంకటేష్ మళ్లీ రీమేక్ కు మొగ్గుచూపాడా లేక మరేదో కారణమో తెలియదు కాని వెంకటేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ ను మరోసారి షాక్ అయ్యేలా చేసింది.