బిగ్ బాస్ కంటెస్టంట్ ఎన్టీఆర్ కు నచ్చేసిందట..!

బిగ్ బాస్ షో చూడని బుల్లి తెర ప్రేక్షకులు అంటూ ఎవరూ లేరు. ఈ షో ఓ రేంజ్ లో క్లిక్ అవ్వడానికి కారణం మాత్రం ఎన్టీఆర్ . ఈయన కనిపించే వారాంతరం ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి షో రేటింగ్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్ళేలా చేస్తున్నాయి. దీంతో జనం టీవీలకు అతుక్కుపోతున్నారు.  

ఉన్న కంటెస్టంట్స్ లో అయితే అందరి కంటే జనం ఎక్కువ మార్కులు వేసింది మాత్రం హరితేజకేనని టాక్. ఇక విజేతగా నిలిచే స్కోప్ కూడా హరితేజకే ఉందని ఓ ప్రచారం కూడా ఉంది. ఇక షో కంటే ముందు ఈ ముద్దుగుమ్మ చేసిన చిత్రం 'అఆ' ఒక్కటే. ఈ మూవీతోనే ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకుంది.

బిగ్ బాస్ షో లో ఈ అమ్మడు చేసే సందడి, మాట్లాడే విధానం ప్రేక్షకులతో పాటు ఎన్టీఆర్ ని కూడా ఆకట్టుకున్నాయట. ఇక ఈ ముద్దుగుమ్మకి మంచి పాత్రలు ఇస్తే పెర్ఫామ్ చేయగలదని ఆయన అనుకుంటున్నారట. ఈ అందాల భామ ఎన్టీఆర్ దృష్టిలో పడింది కాబట్టి ఇక బ్రేక్ రావడం ఖాయం అని ఫిల్మ్ నగర్ జనం చెప్పుకుంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ ఎవరికీ ఏం ఇచ్చిందో ఇస్తుందో తెలియదు కాని హరితెజకు మాత్రం మంచి బ్రేక్ ఇచ్చేలా పరిస్థితులు కనబడుతున్నాయి.