
టాలీవుడ్ నిర్మాతల్లో అల్లు అరవింద్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. క్రేజీ ప్రొడ్యూసర్ గా అరవింద్ కు సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నారు. మధ్య మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో నటించినా పెద్దగా నటన మీద ఆశక్తి కనబర్చలేదు. కాని అగ్రనిర్మాతగా మాత్రం ఎదిగారు.
ఆయన గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే ఓ బ్రాండ్ అని తెలిసిందే. ఇదిలాఉంటే గీతాఆర్ట్స్ 2 అంటూ అల్లు అరవింద్ కొత్త బ్యానర్ స్టార్ చేశారు. దానిపై చిన్న సినిమాల నిర్మాణం చేపట్టారు. ఇక బన్నీ వాసు. జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ తో కలిసి ఆయన వి4 క్రియేషన్స్ అనే పేరుతో మరో బ్యానర్ ను రెడీ చేశారు. ఈ బ్యానర్ పై తెరకెక్కిన మొదటి సినిమా 'నెక్స్ట్ నువ్వే'. ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
ఈ బ్యానర్ ఏర్పాటు చేయడాని గల కారణాలు అల్లు అరవింద్ వివరించారు. కొత్త దర్శకులతో కొత్త ఆలోచనలను పంచుకుంటూ నిర్మాతగా వాళ్లతో కలిసి ప్రయాణించడానికే ఈ బ్యానర్ ను స్టార్ట్ చేశామని అన్నారు. యంగ్ డైరెక్టర్స్ మంచి ఆలోచనలతో వస్తే ప్రోత్సహించడం కోసం ఈ బ్యానర్ రెడీగా ఉందన్నారు. మరి ఇంకెదుకు ఆలస్యం టాలెంట్ ఉన్న వారె ఎవరైనా ట్రై ఈ బ్యానర్ లో ట్రై చేసేయొచ్చు.