
నందమూరి తారక రామారావు మనుమడిగా తెరగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎలాంటి పాత్ర అయిన ఇట్టే చేయగలరు అన్న పేరు కూడా ఉంది. రెగ్యులర్ సినిమాలే కాకుండా సోషియా ఫాంటసీ చిత్రాల్లో కూడా భారీ డైలాగులు సైతం చెప్పగల సత్తా తనకు ఉంది. తాజాగా జై లవకుశలో త్రిపాత్రాభినయం చేశాడు.
అలాంటి యంగ్ టైగర్ ఓ క్యారెక్టర్ చేయాలంటే మాత్రం తెగ భయపడుతున్నారట. ఇంకో విషయం ఏమిటంటే.. ఆ పాత్ర గతంలో ఆయన చేసిందే. ఈ మధ్య కాలంలో అదుర్స్ సీక్వెల్ గురించి ఫిల్మ్ నగర్ లో తెగ ప్రచారం సాగింది. ఎట్టకేలకుఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించారు.
అదుర్స్ సినిమాలో చారి పాత్ర గురించి వివరించారు. అది చాలా గొప్ప పాత్ర అని.. మళ్లీ తాను అంతలా నటించగలనా అన్నది సందేహమనేనని అన్నారు ఎన్టీఆర్. ఈ విషయంలోనే తనకు మళ్ళీ అదుర్స్ సీక్వెల్ అంటే భయం పట్టుకుందని అన్నారు. అయితే ఆలోచనలు , రోజులు ఎప్పుడు ఒకే విధంగా ఉండవని కూడా అనడం మాత్రం గుర్తించాలి. భవిష్యత్తులో ఈ సీక్వెల్ చేస్తానో లేదో చెప్పలేనని తేల్చేశాడు తారక్.