తాప్సీ పన్ను ఫైర్ అవుతుంది

మరోసారి తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చేసింది. బికినీ ధరించి బీచ్ లో కూర్చున్న రెండు ఫొటోలను రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి బికినీలు ధరించడం భారతీయ సంస్కృతికి విరుద్ధమని మండిపడుతున్నారు. 

దీనిపై ముద్దుగుమ్మ తాప్సీ రెస్పాండ్ అయింది. తాను బికినీ వేసుకుంటే అది మన సంస్కృతికి వ్యతిరేకం ఎందుకు అవుతుంది అని ప్రశ్నించింది. మహిళల అభిప్రాయాలను ఎందుకు గౌరవించలేకపోతున్నారని నిలదీసింది. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు.. అనే విషయాలను భారతీయ మహిళలకు పుట్టినప్పటి నుంచే నేర్పిస్తున్నారని తెలిపింది. తాను సంప్రదాయ దుస్తులు ధరిస్తానని చెప్పింది. ఓ సారి బికినీ ధరిస్తే వెంటనే భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అయిపోతుందా అని ప్రశ్నించింది. బికినీ వేసుకోవడానికి బాడీ అనువుగా ఉంటే ఆలోచించాల్సిన పనేముందని అంటోంది.