
క్రేజీ డైరక్టర్ పూరి జగన్నాధ్ సినిమాలో నటించే అరుదైన అవకాశం వచ్చింది. యాక్టింగ్ టాలెంట్ ఉండి సినిమాల్లో నటించాలన్న తపన ఉన్న వారికి పూరి కనెక్ట్ ఓ కాస్టింగ్ కాల్ నిర్వహిస్తుంది. పైసా వసూల్ తర్వాత తనయుడు ఆకాశ్ హీరోగా చేయబోతున్న ఓ లవ్ స్టోరీ కోసం పూరి జగన్నాథ్ ఈ కాస్టింగ్ కాల్ ఏర్పాటు చేశారు.
సినిమాలో 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు గల మగవాళ్లు.. 18 నుండి 45 సంవత్సరాల వయసు గల ఆడవారికి కాస్టింగ్ కాల్ నిర్వహిస్తున్నారు. సినిమాలో హీరో హీరోయిన్ తప్ప మిగతా వారంతా కొత్త వారినే తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇక దీనికి అప్లై చేయాలనుకునే వారు ఈ మెయిల్ ఐడి info@puriconnects.comకి మీ ప్రొఫైల్ పంపితే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ లో మీ పేరు ఉంటే ఆడిషన్స్ కు పిలుపు వచ్చేసినట్టే. అక్కడ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే కనుక ఇక సినిమాలో ఛాన్స్ దొరికేసినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ప్రొఫైల్ ను పూరి కనెక్ట్ మెయిల్ ఐడికి పంపించేయండి.