స్పైడర్ ట్రైలర్ అదుర్స్..!

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న స్పైడర్ మూవీ ట్రైలర్ నున్న అర్ధరాత్రి 12 గంటలకు రిలీజ్ చేశారు. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్స్ బాగా వర్క్ అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి.

మహేష్ తో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. సినిమాలో మహేష్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. మొదటిసారి తమిళంలో మహేష్ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న స్పైడర్ మీద అక్కడ కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఠాగూర్ మధు సమర్పణలో తెరకెక్కించారు. దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది.