
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతుంది. తారక్ మూడు పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కేవలం పాతిక కోట్లేనట. అదెలా సాధ్యం అంటే సినిమా సొంత బ్యానర్ కాబట్టి అన్న దగ్గర రెమ్యునరేషన్ ఏమి తీసుకోలేదట తారక్.
ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం 80 కోట్ల దాకా జరిగిందని తెలుస్తుంది. మిగతా రైట్స్ తో కలిపి మొత్తంగా సినిమా 110 కోట్ల దాకా లాగేశారని తెలుస్తుంది. ఇక సినిమా బడ్జెట్ తీసేస్తే సినిమా ఎలా కాదనుకున్నా 80 కోట్ల లాభం తెచ్చేసినట్టే. రిలీజ్ కు ముందే ప్రాఫిట్స్ చూపిస్తున్న జై లవ కుశ సినిమా కొన్నవారికి కూడా పండుగ వాతారవరణం తెస్తుందో లేదో చూడాలి.