పవన్ ఎన్టీఆర్ సేమ్ టూ సేమ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న మూవీ హింది రైట్స్ భారీగానే సేల్ అయ్యాయి. ఓ ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఆ సినిమా అనువాద హక్కులను సొంతం చేసుకుందట. ఇక ఇదే సినిమాను కొన్న ఆ సంస్థ ఇప్పుడు ఎన్.టి.ఆర్ జై లవ కుశను కూడా సొంతం చేసుకున్నారట. పవన్ సినిమా 11 కోట్ల హింది రైట్స్ అమ్ముడవగా.. జై లవ కుశ మాత్రం 14.5 కోట్ల దాకా అమ్ముడయ్యిందట.

ఎన్.టి.ఆర్, పవన్ ఇద్దరు హిందిలో తమ సినిమాలతో సత్తా చాటుతున్నారు. దసరాకి వస్తున్న ఎన్.టి.ఆర్ జై లవ కుశ బాబి డైరక్షన్ లో వస్తుంది. కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ ట్రిపుల్ రోల్ చేస్తుండటం విశేషం. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.