కుశ టీజర్ రిలీజ్.. ఫుల్ మాస్ లుక్ లో ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'జై లవకుశ'. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ త్రిపాత్రిభినయం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో వరుసగా ఆయా క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫస్ట్ లుక్స్ , టీజర్స్ రిలీజ్ చేశారు. అన్నింటికి కూడా ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్, టీజర్స్ ఎఫెక్ట్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.  

ఇక అన్ని రిలీజ్ చేయగా ఫైనల్ గా 'కుశ' ఇంట్రడక్షన్ మిగిలిపోయింది. దీని కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. తాజాగా ఈ టీజర్ ని రిలీజ్ చేసేశారు. ఇందులో ఎన్టీఆర్ దొంగ పాత్రలో కనిపించనున్నారని అర్ధమవుతోంది. అలాగే అమెరికా చెక్కేసి అక్కడ సెటిల్ అయిపోవాలనే యాంబిషన్ తో ఉన్నట్లుగా ఇట్టే తెలిసిపోతోంది. ఈ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ ఫుల్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. టీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ ఫుల్ జోష్ మీద ఉన్నాయి.

రావణ టీజర్‌లో విలనిజంతో, లవ టీజర్‌లో క్లాస్ లుక్‌తో యంగ్ టైగర్ ఆకట్టుకున్నాడు. తాజాగా కుశ టీజర్ తో మాస్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో.. ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్ కి రప్పించేలా పాత్రలను డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈ మూవీని నందమూరి కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. బాబి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ ఆడియోని రీసెంట్ గా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 21న జైలవకుశ సినిమా రిలీజ్ కాబోతోంది.