డైరెక్ట్ గా మార్కెట్ లోకి స్పైడర్ ఆడియో

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాతో తమిళంలో మార్కెట్ పెంచుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు మహేష్. అందుకే సినిమా ఆడియోని అక్కడే గ్రాండ్ గా ప్లాన్ చేశాడు. సెప్టెంబర్ 9న కోలీవుడ్ అతిరధమహామహుల మధ్య స్పైడర్ ఫంక్షన్ గ్రాండ్ గా జరుగనుంది.

ఇక అదే రోజు తెలుగు సాంగ్స్ డైరెక్ట్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారట. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారట. తెలుగులో మహేష్ సినిమాకు ప్రమోషన్స్ అవసరం లేదు. కాని మొదటిసారి తమిళ ఆడియెన్స్ కు తన సత్తా చూపాలని చేస్తున్న మహేష్ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఆడియో హంగామా లేకున్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో తెలుగు అభిమానులను పలుకరిస్తాడట మహేష్. దసరా బరిలో తారక్ తో పోటీ పడుతున్న మహేష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో అని పరిశ్రమ అంతా ఎదురుచూస్తుంది.