
దర్శకుడిగా ఈమధ్య ఫెయిల్యూర్ అవుతున్న శ్రీనువైట్లకు అవకాశం ఇచ్చే నిర్మాతలు కరువయ్యారని చెప్పాలి. అందుకే తన సినిమాతో స్టార్ రేంజ్ కు వెళ్లిన మాస్ రాజా కనికరించి శ్రీను వైట్లకు ఓ అవకాశం ఇస్తున్నాడట. ఈ సినిమాను నిర్మాణ భాధ్యతలను మైత్రి వారు తీసుకున్నట్టు తెలుస్తుంది. శ్రీమంతుడుతో నిర్మాణ రంగంలోకి వచ్చిన మైత్రి మూవీస్ సెలెక్టెడ్ మూవీస్ తో మంచి అభిరుచి గల నిర్మాతలుగా ఉన్నారు.
మరి వీరు శ్రీను వైట్లకు ఛాన్స్ ఇవ్వడంలో ఇన్నర్ తాట్ ఏంటో తెలియదు కాని ఫ్లాపుల్లో ఉన్న శ్రీనువైట్లకు ఇదో గొప్ప అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేయగా త్వరలో ఈ ప్రాజెక్ట్ గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. మరో పక్క మాస్ మహరాజ్ అనీల్ రావిపుడితో రాజా ది గ్రేట్, విక్రం సిరితో టచ్ చేసి చూడు సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు పూర్తి కాగానే రవితేజ చేసే నెక్ష్ట్ మూవీ శ్రీనుదే అని తెలుస్తుంది.