త్రివిక్రమ్ సినిమాలో విజయ్..!

అర్జున్ రెడ్డితో అదరగొట్టే హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన తర్వాత సినిమాలను సెట్ చేసుకుంటున్నాడు. పెళ్లిచూపులు హిట్ తో పాపులర్ అయిన ఈ కుర్రాడు అర్జున్ రెడ్డితో యూత్ ఫుల్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ యువ హీరోతో సినిమా అంటే దర్శక నిర్మాతలు సైతం ఉరుకులు పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ డేట్స్ దొరికితే చాలు అనుకునే నిర్మాతలు ఎంతమందో.

తెలుస్తున్న సమాచారం ప్రకారం విజయ్ తో త్రివిక్రం సినిమా ఉండబోతుందట. నందిని రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమాను త్రివిక్రం నిర్మిస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు కథ సహకారంలో కూడా త్రివిక్రం హ్యాండ్ ఉందట. అర్జున్ రెడ్డితో కొత్త ప్రయత్నం చేసిన విజయ్ తన తర్వాత సినిమానే త్రివిక్రం లాంటి క్రేజీ డైరక్టర్ బ్యానర్లో చేయడం గొప్ప విషయమని చెప్పొచ్చు. కళ్యాణ వైభోగమే సినిమాతో హిట్ అందుకున్న నందిని రెడ్డి కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.