
ఇడియట్ లాంటి సినిమా తీసిన పూరి స్టార్ డైరక్టర్ అయ్యాక కమర్షియల్ సినిమాల రేసులో పడి లవ్ స్టోరీలకు దూరమయ్యాడు. స్టార్స్ తో సినిమాలు తీసిన లవ్ స్టోరీల విషయంలో కాంప్రమైజ్ అవ్వడు పూరి. ఇక రీసెంట్ గా పైసా వసూల్ తో బాలయ్యను డిఫరెంట్ గా చూపించడంలో సక్సెస్ అయిన పూరి తన తర్వాత సినిమా తనయుడిని హీరోగా పెట్టి తీస్తా అంటున్నాడు.
కొడుకుని హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నంలో నాలుగు అద్భుతమైన కథలను రాసుకున్నాడట పూరి. అందులో హిందు, ముస్లిం ప్రేకథ ఒకటి ఉందట. దాదాపు అదే ఆకాష్ తో చేసే సినిమా అంటున్నాడు పూరి. ప్రస్తుతం ఆకాష్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకునేందుకు హోం వర్క్ చేస్తున్నాడు. పూరి కొడుకుగా ఆకాష్ ఏ రేంజ్ ఇమేజ్ సంపాదిస్తాడో మరి.