సంబంధిత వార్తలు

టాలీవుడ్ లో మాటల మాంత్రికుడుగా పేరొందిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కమర్షియల్ వాల్యూస్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ చిత్రాలను ఇప్పటితరం ప్రేక్షకులకు అందించడంలో మంచి దర్శకుడని చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ సినిమాల్లో కుటుంబ విలువలు, మనిషి యొక్క జీవవ శైలితో పాటు సగటు ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ హంగులతో కూడిన అంశాలు వుంటాయి. ఇక సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు పంథా ఒకరకం. కమర్షియల్ అంశాలు వుంటూనే కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను నిర్మిస్తుంటారు. అలాంటి దిల్ రాజు, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో ఓ సినిమా త్వరలోనే రూపొందబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ప్రకటించాడు. దిల్ రాజు మాట్లాడుతూ... త్రివిక్రమ్ తో నాకు ‘నువ్వేకావాలి’ సినిమా నుంచి మంచి పరిచయం వుంది. ‘అఆ’ రిలీజ్ కు ముందే నాకు, త్రివిక్రమ్ కు మధ్య ఓ సినిమా డీల్ కుదిరింది. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో నా బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాం. ఇందులో ఓ స్టార్ హీరో నటించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మరో రెండు నెలల్లో తెలియజేస్తానని స్పష్టం చేసారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసారు. ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు.